తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05-07-2022) - Horoscope Today

Horoscope Today (05-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope
Horoscope

By

Published : Jul 5, 2022, 4:58 AM IST

వృత్తి,ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. దుర్గారాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

చేపట్టే పనుల్లో స్థిర నిర్ణయాలతో ముందుకు సాగండి. శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల్లో కలుగచేసుకోకండి. ఎవరినీ ఎక్కువగా నమ్మరాదు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనల ద్వారా జ్ఞానోదయం అవుతుంది. శివారాధన చేస్తే మంచిది.

మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. చంద్రధ్యానం శుభప్రదం.

ఉద్యోగంలో స్వస్థానప్రాప్తి ఉంది. వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు సొంతం అవుతాయి. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. లక్ష్మీస్తుతి మరింత శక్తిని ఇస్తుంది.

శరీరసౌఖ్యం కలదు. కీలక విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. సహనంతో వ్యవహరిస్తే సంకల్పాలు నెరవేరుతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవారాధన శక్తిని ఇస్తుంది.

దీర్ఘదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

చేపట్టే పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సహకారంతో సమస్యలు తగ్గుతాయి. అష్టమంలో చంద్రుడు సంచారం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం శుభప్రదం.

అనుకూలమైన సమయం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

ప్రయత్నకార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని చేకూరుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details