తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (04-07-2022) - TODAY ASTROLOGY IN TELUGU

Horoscope Today (04-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
horoscope

By

Published : Jul 4, 2022, 5:14 AM IST

కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. అధికారుల వైఖరి మీపట్ల మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. శని ధ్యానం శుభప్రదం.

పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. దుర్గ ధ్యానం శుభప్రదం.

గ్రహబలం తక్కువగా ఉంది. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగితే సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఒక పనిలో మీకు బంధువులతో వాదోపవాదాలు వద్దు. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. శివ అష్టోత్తరం చదివితే బాగుంటుంది.

మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మంచినిస్తుంది.

అనుకూలమైన సమయం. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్దంగా పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం.

మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మంచినిస్తుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమపెరుగుతుంది. ప్రణాళిక లేకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించిన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. హనుమత్ ఆరాధనా శ్రేయోదాయకం.

మీ మీ రంగాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరమవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించుకోండి.

బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

శుభకాలం. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details