ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికి రాదు. ఓర్పు చాలా అవసరం. బంధు,మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చేపట్టే పనిలో విఘ్నం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. చంద్రధ్యానం శుభప్రదం.
మొదలుపెట్టే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దుర్గారాధన శుభప్రదం.
మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరు. ఆర్ధికంగా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. దైవారాధన మానవద్దు.
ఊహించిన ఫలితాలు వస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మసిద్ధి ఉంది. ఈశ్వర నామాన్ని జపించాలి.
ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడతారు. మీ ప్రతిష్టకు మచ్చతెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. శివ మహిమ స్తోత్రం చదివితే బాగుంటుంది.