Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? (01-07-2022) - శంకరమంచి శివసాయి శ్రీనివాస్
Horoscope Today (01-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
Horoscope Today
By
Published : Jul 1, 2022, 4:18 AM IST
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.
కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది.లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
ఎంత శ్రమిస్తారో అంత ఫలితాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. శివారాధన శుభప్రదం.
కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మనఃసౌఖ్యం ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది.
మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణ శుభకరం.
ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.
అదృష్టవంతులు అవుతారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా సానుకూలం. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధి సాధించే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధన శుభప్రదం.
ప్రారంభించిన పనిలో ఆలోచనలు మారకుండా చూసుకోవాలి. కొన్ని వ్యవహారాలలో మనోధైర్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఎట్టిపరిస్థితిల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. శివధ్యానం శుభప్రదం.