తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? (28-06-2022) - నేటి మీ దినఫలం

Horoscope Today (28/06/2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope
Horoscope

By

Published : Jun 28, 2022, 4:19 AM IST

శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మిశ్రమకాలం. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి శ్రమ అధికమవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

పట్టుదల వదలకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. తోటివారి సహకారంతో ఉన్నతస్థితికి చేరతారు. ఇష్ట దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారములలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. దుర్గ ధ్యానం చేయడం మంచిది.

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. మీమీ రంగాల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

గొప్ప శుభకాలం . కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మధ్యమ ఫలితాలున్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. కీలక నిర్ణయములు తీసుకోవడంలో తడబాటు వలన అవకాశములను కోల్పోయే ప్రమాదం ఉంది. శనిధ్యాన శ్లోకం చదవండి.

బుద్దిబలం బాగుంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారములలో మీరు ఆశించిన ఫలితములు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితములను పొందగలుగుతారు.

మధ్యమ ఫలితాలున్నాయి. కీలకమైన వ్యవహారములలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో అప్రమత్తముగా ఉండాలి. శివ నామాన్ని జపించడం మంచిది.

అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారములో అధికారులతో జాగ్రత్త. కుటుంబ సభ్యుల సహకారం మేలుచేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details