తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today(06-01-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - January 6 Horoscope

Horoscope Today (06-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Jan 6, 2022, 4:28 AM IST

Horoscope Today (06-01-2022): ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు..

మేషం

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.

వృషభం

సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

మిథునం

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభఫలితాలు పొందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం.

సింహం

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

కన్య

మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవ్వరితోనూ గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

తుల

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. లింగాష్టకం చదవండి. మంచి జరుగుతుంది.

ధనుస్సు

ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మకరం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

కుంభం

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.

మీనం

పట్టుదలతో కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ది విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details