తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (25-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today (25-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయంటే..

HOROSCOPE TODAY
నేటి రాశిఫలం

By

Published : Sep 25, 2021, 4:20 AM IST

Updated : Sep 25, 2021, 6:42 AM IST

ఈరోజు (25-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం

చవితి:ఉ. 8.40 వరకు తదుపరి పంచమి

భరణి:ఉ.10.57 వరకు తదుపరి కృత్తిక

వర్జ్యం:రా.12.12 నుంచి 1.57 వరకు.

అమృత ఘడియలు:ఉ. 7.27 వరకు.

దుర్ముహూర్తం:ఉ.5.52 నుంచి 7.28 వరకు.

రాహుకాలం:ఉ. 9.00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ.5-52, సూర్యాస్తమయం: సా.5-53.

మేషం

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృషభం

కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. మనోధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించడం మంచిది.

మిథునం

కుటుంబ సౌఖ్యం కలదు. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామ స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం

లాభదాయకమైన కాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. విద్యావినోదసుఖం ఉంది. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

సింహం

ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని రానీయకండి. దుర్గాస్తుతి పఠిస్తే బాగుంటుంది.

కన్య

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

తుల

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.

వృశ్చికం

గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ధనుస్సు

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మకరం

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగడానికి లక్ష్మీధ్యానం శుభప్రదం.

కుంభం

ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం.

మీనం

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.

Last Updated : Sep 25, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details