తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (24-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాటి రాశి ఫలితాలు

Horoscope Today (24-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయంటే..

Horoscope Today
నేటి రాశిఫలం

By

Published : Sep 24, 2021, 4:22 AM IST

Updated : Sep 24, 2021, 6:10 AM IST

ఈరోజు (24-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం

తదియ:ఉ.7.00 తదుపరి చవితి

అశ్విని:ఉ. 8.42 తదుపరి భరణి

వర్జ్యం:ఉ.శే.వ. 6.07 వరకు తిరిగి రా. 7.12 నుంచి 8.57 వరకు.

అమృత ఘడియలు:తె.5.42 ల.

దుర్ముహూర్తం:ఉ.8.16 నుంచి 9.04 వరకు తిరిగి మ. 12.17 నుంచి 1.05 వరకు.

రాహుకాలం:ఉ.10.30 నుంచి 12.00 వరకు.

సూర్యోదయం:ఉ.5-52,

సూర్యాస్తమయం:సా.5-54

మహా భరణి, సంకష్టహర చతుర్ధి

మేషం

శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మంచి ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

వృషభం

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మిథునం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

గ్రహబలం అనుకులిస్తోంది. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

సింహం

తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

కన్య

సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది.

తుల

కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

వృశ్చికం

గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. కాలం అన్నివిధాలుగా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

ధనుస్సు

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

మకరం

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కొత్తవస్తువులు కొంటారు. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కుంభం

కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.

మీనం

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 19 - 25)

Last Updated : Sep 24, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details