ఈరోజు (23-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం
- విదియ: ఉ.5.54 వరకు తదుపరి తదియ
- రేవతి: ఉ. 6.29 వరకు తదుపరి అశ్విని
- వర్జ్యం:తె. 4.24 నుంచి
- అమృత ఘడియలు: ఉ. 6.07 వరకు తిరిగి రాత్రి 12.59 నుంచి 2.41 వరకు
- దుర్ముహూర్తం: ఉ.9.53 నుంచి 10.41 వరకు తిరిగి మ. 2.42 నుంచి 3.30 వరకు
- రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
- సూర్యోదయం: ఉ.5-52,
- సూర్యాస్తమయం: సా.5-55
- ఉండ్రాళ్ళ తద్దె
మేషం
శ్రమతో కూడిన శుభ ఫలితాలు ఉన్నాయి. మీలోని పోరాట పటిమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
వృషభం
స్థిరమైన ఆలోచనలతో సత్పలితాలను సాధిస్తారు. వ్యాపారులు కాస్త ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.
మిథునం
మనస్సౌఖ్యం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
కర్కాటకం
శుభసమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
సింహం
మనోబలం సర్వదా రక్షిస్తుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు అందుతాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.
కన్య
కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. శివాష్టకం చదివితే బాగుంటుంది.