ఈరోజు (18/09/21) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
గ్రహబలం: శ్రీ ప్లవనామ సంవత్సరం..
- దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్లపక్షం ద్వాదశి: ఉ. 6.57 తదుపరి త్రయోదశి తె. 5.52
- తదుపరి చతుర్దశి ధనిష్ట: తె. 4.20
- తదుపరి శతభిషం వర్జ్యం: ఉ 8.45 నుంచి 10.19 వరకు
- అమృత ఘడియలు: సా.6.09 నుంచి 7.43 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 5.52 నుంచి 7.28 వరకు
- రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
- సూర్యోదయం: ఉ.5-52
- సూర్యాస్తమయం: సా.5-59 శని త్రయోదశి
మేషం..
చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు.అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి దర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
వృషభం..
చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.
మిథునం..
సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.
కర్కాటకం..
శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సింహం..
ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని చేకూరుస్తుంది.
కన్య..