తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (07-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - నేటి మీ రాశిఫలం

Horoscope Today(07-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
నేటి మీ రాశిఫలం

By

Published : Oct 7, 2021, 4:28 AM IST

ఈరోజు (07-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం

శుక్లపక్షం పాడ్యమి: మ. 3.27 తదుపరి విదియ

చిత్త: రా. 12.05 తదుపరి స్వాతి

వర్జ్యం: ఉ. 8.48 నుంచి 10.20 వరకు తిరిగి తె. 5.22 నుంచి

అమృత ఘడియలు: సా.5.58 నుంచి 7.30 వరకు

దుర్ముహూర్తం: ఉ. 9.50 నుంచి 10.37 వరకు తిరిగి మ. 2.33 నుంచి 3.21 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.5-43

శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఆరంభం, కలశ స్థాపన

మేషం

శుభకాలం. మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

మిథునం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతాస్తుతి శుభప్రదం.

కర్కాటకం

అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

సింహం

ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈశ్వర దర్శనం శుభప్రదం.

తుల

శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.

వృశ్చికం

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

ధనుస్సు

మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

మకరం

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రమేయం లేని వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

కుంభం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీనం

మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details