ఈరోజు (25-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం
బహుళపక్షం పంచమి: తె. 4.26, తదుపరి షష్టి మృగశిర: రా. 1.42 తదుపరి ఆర్ద్ర
వర్జ్యం: ఉ.శే.వ. 7.05 వరకు
అమృత ఘడియలు: మ. 3.57 నుంచి 5.43 వరకు
దుర్ముహూర్తం: మ. 12.08 నుంచి 12.54 వరకు తిరిగి 2.26 నుంచి 3.12 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.5-59, సూర్యాస్తమయం: సా.5-31
మేషం
మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీమీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడకపోతే అపకీర్తిని మూటకట్టు కుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగును.
వృషభం
సంపూర్ణ ఆత్మవిశ్వసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
మిథునం
తలపెట్టిన కార్యాల్లో శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.
కర్కాటకం
శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.
సింహం
చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
కన్య
సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగుజాగ్రత్తలు అవసరం. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం
తుల
చేపట్టిన పనులలో మనోబలంతో తగ్గకుండా చూసుకోవాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.
వృశ్చికం
దైవ బలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్నిస్తుంది.
ధనుస్సు
సంపూర్ణ ఆత్మవిశ్వసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
మకరం
ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులు పోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.
కుంభం
శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య ఆరాధనా మేలు చేస్తుంది.
మీనం
బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. స్తిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 24 - అక్టోబరు 30)