ఈరోజు (23-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం
బహుళపక్షం తదియ: రా. 12.15 తదుపరి చవితి
కృత్తిక: రా. 8.31 తదుపరి రోహిణి
వర్జ్యం: రా. 7.18 నుంచి 9.03 వరకు
అమృత ఘడియలు: సా.5.52 నుంచి 7.38 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.58 నుంచి 7.30 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.5-32
మేషం
ప్రారంభించబోయే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతిచనువు వద్దు. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
వృషభం
శుభసమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిథునం
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది.
కర్కాటకం
ప్రయత్న కార్యానుకూలత ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
సింహం
మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. కృష్ణాష్టకం పఠిస్తే బాగుంటుంది.
కన్య
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు ఆరాధన మంచిది. సూర్య ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.
వృశ్చికం
మంచి కాలం. ప్రారంభించిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
ధనుస్సు
శుభకాలం. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. నవగ్రహాలను ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కుంభం
మిశ్రమకాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
మీనం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. విందూ,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
ఇదీ చూడండి :జామపండ్ల కోసం చెట్టెక్కి ప్రాణాల మీదకు