ఈరోజు (22-10-2021) గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- శ్రీ ప్లవనామ సంవత్సరం- దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం; బహుళపక్షం.
- విదియ: రా.10.17 తదుపరి తదియ.
- భరణి: సా. 6.05 తదుపరి కృత్తిక.
- వర్జ్యం: లేదు.
- అమృత ఘడియలు: మ.12.51 నుంచి 2.35 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 8.16 నుంచి 9.03 వరకు తిరిగి మ. 12.08 నుంచి 12.54 వరకు
- రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
- సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.5-32.
- అశూన్య శయన వ్రతం
మేషం..
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
వృషభం..
శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
మిథునం..
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.
కర్కాటకం..
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈశ్వర దర్శనం శుభప్రదం.
సింహం..
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.
కన్య..