తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (20-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - నా రాశిఫలం ఎలా ఉంది?

ఈ రోజు(20-10-2021) రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయో డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ మాటల్లో తెలుసుకుందాం..

horoscope
horoscope

By

Published : Oct 20, 2021, 4:30 AM IST

Updated : Oct 20, 2021, 10:00 AM IST

నేటి(20-10-2021) రాశిఫలం, గ్రహబలాలపై డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు;

ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం పూర్ణిమ: రా. 7.20 తదుపరి బహుళ పక్ష పాడ్యమి

రేవతి: మ. 2.11 తదుపరి అశ్విని

వర్జ్యం: లేదు

అమృత ఘడియలు: ఉ.11.39 నుంచి 1.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.22 నుంచి 12.08 వరకు

రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.5-57, సూర్యాస్తమయం: సా.5-34

మేషం..

శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం..

అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మిథునం..

మనోధైర్యంతో చేసే పనులు సత్పలితాన్ని ఇస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. సౌమ్య సంభాషణ అవసరం. దైవారాధన మానవద్దు.

కర్కాటకం..

ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.

సింహం..

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

కన్య..

అనుకున్నది సాధిస్తారు. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా సత్ఫలితాలను అందుకుంటారు. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విష్ణు దర్శనం శుభప్రదం.

తుల..

కొత్త పనులు చేపడతారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.

వృశ్చికం..

పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

ధనస్సు..

కష్టానికి తగిన ఫలితాలు సొంతం అవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. దుర్గా దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మకరం..

మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఎవరినీ పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. ఇబ్బందులు దరిచేరవు. సూర్య ధ్యానం శుభప్రదం.

కుంభం..

పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. లక్ష్మీధ్యానం చేయండి.

మీనం..

శుభకాలం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సహకారం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన కాలం. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించాలి.

Last Updated : Oct 20, 2021, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details