తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (02-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - శనివారం రాశిఫలాలు

Horoscope Today(02-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Oct 2, 2021, 5:10 AM IST

ఈరోజు (02-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..


శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష రుతువు, భాద్రపద మాసం

బహుళపక్షం ఏకాదశి:రా. 7.44 తదుపరి ద్వాదశి

ఆశ్లేష :రా. 1.36 తదుపరి మఘ

వర్జ్యం:మ. 1.53 నుంచి 3.33 వరకు

అమృత ఘడియలు:సా. 5.41 నుంచి 7.23 వరకు

దుర్ముహూర్తం:ఉ. 5.54 నుంచి 7.29 వరకు

రాహుకాలం:ఉ. 9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం:ఉ.5-54

సూర్యాస్తమయం:సా.5-48 సర్వ ఏకాదశి, గాంధీ జయంతి

మేషం

మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాలికను సిద్ధం చేయండి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.

వృషభం

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మిథునం

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

కర్కాటకం

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలున్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.

సింహం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.

కన్య

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

తుల

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

వృశ్చికం

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

మకరం

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. శ్రీ రామ నామాన్ని జపించడం శుభప్రదం.

కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.

మీనం

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. స్థిరమైన బుద్ధితో మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details