ఈరోజు (16-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం
శుక్లపక్షం ఏకాదశి: రా. 7.11 తదుపరి ద్వాదశి
ధనిష్ఠ: మ. 12.00 తదుపరి శతభిషం
వర్జ్యం: రా. 7.08 నుంచి 8.43 వరకు
అమృత ఘడియలు: తె.4.40 నుంచి
దుర్ముహూర్తం: ఉ.5.56 నుంచి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.5-36
సర్వఏకాదశి
మేషం
మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం పారాయణ శుభప్రదం.
వృషభం
మాధ్యమ ఫలితాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. మీ మీ రంగాల్లో బలమైన ప్రయత్నంతో ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
మిథునం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.
కర్కాటకం
అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువుల వ్యవహారాలలో అంటీ ముట్టనట్టుగా ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
సింహం
భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
కన్య
స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామ స్మరణ మంచి ఫలితాలను చేకూరుస్తుంది.
తుల
ముందుచూపుతో వ్యవహరించాలి.కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాలను ఇస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
వృశ్చికం
శుభకాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్ర సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవారాధన శుభకరం.
ధనుస్సు
మీ రంగంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ దుర్గాధ్యానం శుభప్రదం.
మకరం
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.
కుంభం
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మీనం
సర్వత్రా శుభ ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
ఇదీ చూడండి :Dasara Festival 2021: దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు