తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (14-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - రాశిఫలాలు వార్తలు

Horoscope Today(14-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Oct 14, 2021, 3:29 AM IST

Updated : Oct 14, 2021, 6:40 AM IST

నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈరోజు (14-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం

శుక్లపక్షం నవమి: రా. 9.53 తదుపరి దశమి

ఉత్తరాషాఢ: మ. 1.35 తదుపరి శ్రవణం

వర్జ్యం: రా. 5.25 నుంచి 6.57 వరకు

అమృత ఘడియలు: ఉ.7.30 నుంచి 9.01 వరకు తిరిగి రా.2.37 నుంచి 4.09 వరకు

దుర్ముహూర్తం: ఉ.9.50 నుంచి 10.36 వరకు తిరిగి మ.2.30 నుంచి 3.17 వరకు

రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.5-38; మహార్నవమి

మేషం

ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.

వృషభం

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

మిథునం

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

కర్కాటకం

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

సింహం

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్య

కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.

తుల

మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చికం

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శని ధ్యానం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మకరం

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది.

కుంభం

శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ మంచిది.

మీనం

పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ఇదీ చూడండి :దసరా సందడి- ఇంట్లోనే 31 దేశాల బొమ్మల ప్రదర్శన

Last Updated : Oct 14, 2021, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details