తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (06-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - రాశులు ఫలితాలు

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశిఫలం

By

Published : Nov 6, 2021, 4:53 AM IST

ఈరోజు(6-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తీక మాసం; శుక్లపక్షం

విదియ:రా. 10.57 తదుపరి తదియ

అనూరాధ:తె.3.41 తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం:ఉ.9.02 నుంచి 10.31 వరకు

అమృత ఘడియలు:సా. 5.58 నుంచి 7.28 వరకు

దుర్ముహూర్తం:ఉ.6.04 నుంచి 7.34 వరకు

రాహుకాలం:ఉ. 9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం:ఉ.6.04, సూర్యాస్తమయం: సా.5-24

చంద్రదర్శనం,భగినీ హస్తభోజనం

మేషం

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

వృషభం

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

మిథునం

మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభి మ్రోగిస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

సింహం

బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు

తుల

పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాలు వినియోగించండి గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనస్సంతోషాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మకరం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.

కుంభం

మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మీనం

మధ్యమ ఫలితాలున్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్ళండి మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details