తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (05-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - నవంబర్​ 5 గ్రహఫలం

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశిఫలం

By

Published : Nov 5, 2021, 4:28 AM IST

ఈరోజు(5-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తీక మాసం;శుక్లపక్షం

పాడ్యమి:రా.1.16 తదుపరి విదియ

స్వాతి:ఉ.6.50 విశాఖ తె. 5.18 తదుపరి అనూరాధ

వర్జ్యం:మ.12.04 నుంచి 1.34 వరకు

అమృత ఘడియలు:రాత్రి 9.04 నుంచి 10.34 వరకు

దుర్ముహూర్తం:ఉ. 8.20 నుంచి 9.05 వరకు తిరిగి మ .12.07 నుంచి 12.52 వరకు

రాహుకాలం:ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం:ఉ.6.04, సూర్యాస్తమయం: సా.5-26 ఆకాశ దీపారంభం

మేషం

ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవం పారాయణ చేయడం వల్ల బాగుంటుంది.

వృషభం

సౌభాగ్యప్రాప్తి కలదు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి.

మిథునం

మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలకు మీరు ఆశించిన సహాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. చతుర్ధంలో చంద్రబలం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం శుభప్రదం.

సింహం

ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

కన్య

కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

తుల

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠనం శుభప్రదం.

వృశ్చికం

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ధనుస్సు

లక్ష్య సాధనలో అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వరదర్శనం శుభకరం.

మకరం

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.

కుంభం

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

మీనం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 31 - నవంబర్​ 06)

ABOUT THE AUTHOR

...view details