ఈరోజు (22-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళపక్షం
తదియ: రా. 7.10 తదుపరి చవితి
మృగశిర: ఉ. 8.53 తదుపరి ఆరుద్ర
వర్జ్యం: సా. 6.07 నుంచి 7.53 వరకు
అమృత ఘడియలు: రా.12.17 నుంచి 2.03 వరకు
దుర్ముహూర్తం: మ.12.08 నుంచి 12.52 వరకు; తిరిగి మ.2.21 నుంచి 3.06 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6.12, సూర్యాస్తమయం: సా.5-20
మేషం
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.
వృషభం
కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. తోటి వారిని కలుపుకు పోవడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
మిథునం
మొదలుపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవం పారాయణ చేస్తే బాగుంటుంది.
కర్కాటకం
మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సహాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మరింత శుభం జరుగుతుంది.
సింహం
సౌభాగ్యప్రాప్తి ఉంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి తగిన సాయం చేసేవారు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి.
కన్య
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. జన్మరాశిలో చంద్ర బలం యోగిస్తోంది. గణపతి ఆరాధన శుభప్రదం.
తుల
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఒక వార్త ఇబ్బంది కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చిరునవ్వుతో సమస్యలు దూరమవుతాయి. దైవారాధన మానవద్దు.
ధనుస్సు
ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభదాయకం.
మకరం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని శుభ ఫలితాలే పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.
కుంభం
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.
మీనం
కాలం అనుకూలంగా ఉంది. శరీర సౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
ఇదీ చూడండి :15వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు