తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (02-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - Horoscope Today latest news

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశిఫలం

By

Published : Nov 2, 2021, 4:29 AM IST

ఈరోజు(2-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం;దక్షిణాయనంశరదృతువు; ఆశ్వయుజ మాసం; బహుళపక్షం

ద్వాదశి:ఉ. 8.25 తదుపరి త్రయోదశి,

ఉత్తర:ఉ. 9.47 తదుపరి హస్త,

వర్జ్యం:సా. 5.51 నుంచి 7.30 వరకు,

అమృత ఘడియలు:తె. 3.17 నుంచి 4.50వరక,

దుర్ముహూర్తం:ఉ. 8.18 నుంచి 9.04 వరకు తిరిగి రాత్రి 10.28 నుంచి 11.18 వరకు,

రాహుకాలం:మ. 3.00 నుంచి 4.30 వరకు,

సూర్యోదయం: ఉ.6.02, సూర్యాస్తమయం: సా.5-26,

మేషం

ధర్మసిద్ది ఉంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. గొప్పవారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదేవతాస్తుతి శుభప్రదం.

వృషభం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం.

మిథునం

గ్రహబలం అనుకూలంగా లేదు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీసర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

సింహం

మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

కన్య

అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.

తుల

ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం

మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. ఆంజనేయ దర్శనం మంచిది.

ధనుస్సు

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మకరం

ధర్మసిద్ధి ఉంది, సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే బాగుంటుంది.

కుంభం

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. శని జపం అనుకూలతనిస్తుంది.

మీనం

ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకం పఠిస్తే బాగుంటుంది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 31 - నవంబర్​ 06)

ABOUT THE AUTHOR

...view details