ఈరోజు(17-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం; శుక్లపక్షం
త్రయోదశి: ఉ. 9.52 తదుపరి చతుర్దశి
అశ్విని: రా. 11.19 తదుపరి భరణి
వర్జ్యం: రా.7.02 నుంచి 8.44 వరకు
అమృత ఘడియలు: మ.3.36 నుంచి 5.19 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.22 నుంచి 12.07 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6.09
సూర్యాస్తమయం: సా.5-21
మేషం
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తోటివారి సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
ప్రయత్న కార్యసిద్ది ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
మిథునం
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. శివనామస్మరణ శుభాన్ని ఇస్తుంది.
కర్కాటకం
శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.
సింహం
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.
కన్య
ప్రారంభించిన పనిలో కార్యసిద్ధి ఉంది. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
తుల
సమయానుకూలంగా ముందుకు సాగండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గాఅష్టోత్తర శతనామావళి చదవాలి.
వృశ్చికం
ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
ధనస్సు
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దుర్గారాధన శుభప్రదం.
మకరం
ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కుంభం
అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.
మీనం
లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. గణపతి సహస్ర నామ పారాయణ వల్ల మంచి జరుగుతుంది.