ఈరోజు (1-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం, శరదృతువు; ఆశ్వయుజ మాసం;
బహుళపక్షం ఏకాదశి: ఉ. 9.18 తదుపరి ద్వాదశి పుబ్బ: ఉ.10.03
తదుపరి ఉత్తర వర్జ్యం: సా. 5.09 నుంచి 6.44 వరకు
అమృత ఘడియలు: రా. 2.39 నుంచి 4.14 వరకు
దుర్ముహూర్తం: మ. 12.07 నుంచి 12.53 వరకు తిరిగి 2.24 నుంచి 3.10 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6.02, సూర్యాస్తమయం: సా.5-27
మేషం
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. లింగాష్టకం చదవాలి.
వృషభం
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
మిథునం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
చిత్తశుద్ధితో చేసేపనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.
సింహం
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.
కన్య
మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని వెంకటేశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల
మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.
వృశ్చికం
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.
ధనుస్సు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.
మకరం
బద్దకించకుండా పనిచేస్తే కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కుంభం
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం మంచినిస్తుంది.
మీనం
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఇదీ చూడండి :దీపావళి షాపింగ్‌తో మార్కెట్లు కిటకిట.. కొవిడ్ రూల్స్ గాలికి..