తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (07-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - గ్రహబలం

Horoscope Today (07-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

By

Published : May 7, 2022, 3:29 AM IST

Horoscope Today(07-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు
వైశాఖమాసం; శుక్లపక్షం షష్ఠి: ఉ. 11-08 తదుపరి సప్తమి
పునర్వసు: ఉ. 9-05 తదుపరి పుష్యమి; వర్జ్యం: సా. 5-51 నుంచి 7-36 వరకు
అమృత ఘడియలు: ఉ.6-27 నుంచి 8-13 వరకు తిరిగి తె. 4-22 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 5-35 నుంచి 7-16 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.5.35, సూర్యాస్తమయం: సా.6.17

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఒక వార్త ఇబ్బంది కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అశుభఫలితాలు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

మిశ్రమకాలం. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి,ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు వెలువడుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శుభసమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలుచేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రీలక్ష్మి గణపతి దర్శనం శక్తిని ఇస్తుంది.

శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. ఒత్తిడికి గురికాకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మొహమాటంతో నష్టపోకుండా జాగ్రత్త పడండి. ఇష్టదైవదర్శనం శుభప్రదం.

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనిలో అలసట పెరుగుతుంది. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం,విచారం, కలుగుతాయి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

మీ బుద్దిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీదైన ప్రతిభ కనబరుస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. దేహజాఢ్యాన్ని రానీయకండి.ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. దుర్గా ఆరాధన శుభప్రదం.

మనస్సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. కోపాన్ని తగ్గించుకోకపోతే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. సూర్య ఆరాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details