తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (05-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశి ఫలాలు

Horoscope Today (05-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
ఈనాడు రాశి ఫలాలు

By

Published : May 5, 2022, 5:50 AM IST

Horoscope Today(05-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు;

వైశాఖమాసం; శుక్లపక్షం చవితి: ఉ. 7-07 తదుపరి పంచమి ఆర్ద్ర: పూర్తి

వర్జ్యం: మ. 1-14 నుంచి 3-01 వరకు

అమృత ఘడియలు: రా. 7-27 నుంచి 9-14 వరకు

దుర్ముహూర్తం: ఉ. 9-49 నుంచి 10-39 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-43 వరకు

రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు

సూర్యోదయం: ఉ.5.36, సూర్యాస్తమయం: సా.6.16 శ్రీ రామానుజ జయంతి

మేషం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

వృషభం

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గరాధన శుభప్రదం.

మిథునం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యవిషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం చదవడం మంచిది.

సింహం

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాధ్యానం శుభప్రదం.

కన్య

శుభకాలం. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్దిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

తుల

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

వృశ్చికం

మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వరస్తోత్రం చదవడం శుభకరం.

ధనుస్సు

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఖర్చులు చేయిదాటకుండా చూసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కనకదుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మకరం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు,వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

కుంభం

సందర్భోచిత నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. గోవిందనామాలు చదవడం ఉత్తమం.

మీనం

చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్ధిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి శ్రీవేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

ఇదీ చూడండి:ఈ వారం (మే 1-7) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ABOUT THE AUTHOR

...view details