తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-05-2022) - జాతక చక్రం

Horoscope Today (30-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
horoscope today

By

Published : May 30, 2022, 4:03 AM IST

Horoscope Today(30-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

తలపెట్టిన పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తిచెందకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే శుభప్రదం.

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయవద్దు. సాయిబాబా నామాన్ని జపిస్తే మంచిది.

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.

శుభకాలం. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం ఉత్తమం.

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీ చేతికి నగదు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు పొందుతారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. మనోబలం పెరగటానికి లక్ష్మీదేవి ధ్యానం చేయాలి.

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details