Horoscope Today(03-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు;
వైశాఖమాసం; శుక్లపక్షం తదియ: తె. 5-10 తదుపరి చవితి
రోహిణి: రా. 1-24 తదుపరి మృగశిర
వర్జ్యం: సా. 4-39 నుంచి 6-23 వరకు
అమృత ఘడియలు: రా.9-54 నుంచి 11-38 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-08 నుంచి 8-59 వరకు తిరిగి రా. 10-47 నుంచి 11-33 వరకు
రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.5.37, సూర్యాస్తమయం: సా.6.15
మేషం
ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాధ్యానం చేస్తే మంచిది.
వృషభం
శుభఫలితాలు ఉన్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్దిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్దిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం శుభప్రదం.
మిథునం
ముఖ్య విషయాల్లో మనోబలం అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చంద్రధ్యానం శుభప్రదం.
కర్కాటకం
విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.
సింహం
మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.
కన్య
సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యానశ్లోకం చదవాలి.
తుల
శ్రమ పెరుగుతుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం
గొప్ప శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
ధనుస్సు
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
మకరం
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం శుభప్రదం.
కుంభం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శనిజపం చేసుకోవాలి.
మీనం
మనోధైర్యంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మనఃసౌఖ్యం ఉంది. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. చంద్రధ్యానం శుభప్రదం.
ఇదీ చూడండి:ఈ వారం (మే 1-7) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..