Horoscope Today(28-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం;
బహుళపక్షం త్రయోదశి: మ. 1-19 తదుపరి చతుర్దశి,
భరణి: తె. 4-43 తదుపరి కృత్తిక
వర్జ్యం: మ.1-30 నుంచి 3-11 వరకు
అమృత ఘడియలు: రా.11-38 నుంచి 1-26 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5-29 నుంచి 7-12 వరకు
రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
సూర్యోదయం: ఉ.5.29, సూర్యాస్తమయం: సా.6.25, మాస శివరాత్రి
మేషం
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం.
వృషభం
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
మిథునం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం చదవాలి.
కర్కాటకం
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
సింహం
అవసరానికి తగిన సహాయం అందుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
తుల
ధర్మసిద్ది ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
వృశ్చికం
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.
ధనుస్సు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
మకరం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.
కుంభం
శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.
మీనం
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలోల నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (మే 22 - 28)