తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26/05/2022) - ఈనాడు రాశి ఫలాలు

Horoscope Today (26-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం

By

Published : May 26, 2022, 5:28 AM IST

Horoscope Today(26-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం;

బహుళపక్షం ఏకాదశి: మ.1-03 తదుపరి ద్వాదశి

రేవతి: రా.2-29 తదుపరి అశ్విని

వర్జ్యం: మ.2-18 నుంచి 3-56 వరకు

అమృత ఘడియలు: రా.12-03 నుంచి 1-40 వరకు

దుర్ముహూర్తం: ఉ.9-47 నుంచి 10-38 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-48 వరకు

రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు

సూర్యోదయం: ఉ.5.29, సూర్యాస్తమయం: సా.6.24 శ్రీ మహా జయంతి

మేషం

ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

వృషభం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్నిఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునం

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా అలోచించి ముందుకు సాగాలి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీగణపతి దర్శనం శక్తిని ఇస్తుంది.

సింహం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

కన్య

మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.

తుల

మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాలను కలిగిస్తుంది.

వృశ్చికం

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. సుఖసౌఖ్యాలు కలవు. ఒక వార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

ధనుస్సు

అదృష్టవంతమైన కాలం. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మకరం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

కుంభం

బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.

మీనం

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (మే 22 - 28)

ABOUT THE AUTHOR

...view details