తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-05-2022) - horoscope in telugu

Horoscope Today (25-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

astrology in telugu
Horoscope Today

By

Published : May 25, 2022, 5:12 AM IST

Horoscope Today(25-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు;

వైశాఖమాసం; బహుళపక్షం దశమి: మ. 1-40 తదుపరి ఏకాదశి

ఉత్తరాభాద్ర: రా. 2-08 తదుపరి రేవతి

వర్జ్యం: ఉ. 11-47 నుంచి 1-23 వరకు

అమృత ఘడియలు: రా. 9-21 నుంచి 10-56 వరకు

దుర్ముహూర్తం: ఉ. 11-30 నుంచి 12-22 వరకు

రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు

సూర్యోదయం: ఉ.5.29, సూర్యాస్తమయం: సా.6.24 శ్రీ హనుమ జయంతి

మేషం

ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. నారాయణ మంత్రాన్ని జపించాలి.

వృషభం

మీ మీ రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.

మిథునం

గ్రహబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. లలితాదేవి నామస్మరణ శుభకరం.

కర్కాటకం

ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలదు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం

భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గా నామస్మరణ ఉత్తమం.

కన్య

శుభ ఫలితాలు ఉన్నాయి. బుద్దిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

తుల

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

వృశ్చికం

చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడాలి. సంతోషంగా ఉంటారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శివ దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

మకరం

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్ధికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

కుంభం

మిశ్రమ కాలం. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. చేపట్టే పనిలో బద్ధకం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. సూర్యారాధన మేలు చేస్తుంది.

మీనం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు,వినోదాలతో కాలాన్ని గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపదలు తొలుగుతాయి.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (మే 22 - 28)

ABOUT THE AUTHOR

...view details