తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? (23-05-2022) - రాశి ఫలాలు today

Horoscope Today (23-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
HOROSCOPE TODAY

By

Published : May 23, 2022, 4:01 AM IST

Updated : May 23, 2022, 4:29 AM IST

Horoscope Today(23-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

గ్రహబలం
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం; బహుళపక్షం అష్టమి: సా. 4-44 తదుపరి నవమి శతభిషం: రా. 2-45, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: ఉ. 10-35 నుంచి 12-07 వరకు అమృత ఘడియలు: రా.7-49 నుంచి 9-22 వరకు దుర్ముహూర్తం: మ.12-22 నుంచి 1-13 వరకు తిరిగి 2-56 నుంచి 3-48 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.30, సూర్యాస్తమయం: సా.6.23

శుభకాలం. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఇష్టదైవారాధన మంచిది.

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం ద్వారా విభేదాలు వచ్చే సూచనలున్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభదాయకం.

కీలక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని పొందుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి వేంకటేశ్వర స్వామిని పూజించాలి.

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తారు. అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. తోటివారి సహాయం లభిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శుభదాయకం.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టమైన వారితో మరపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన ఉత్తమం.

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజానపడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Last Updated : May 23, 2022, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details