తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? (21-05-2022) - రాశి ఫలాలు today

Horoscope Today (21-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
HOROSCOPE TODAY

By

Published : May 21, 2022, 3:25 AM IST

Horoscope Today(21-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మనఃస్సౌఖ్యం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.శివ నామస్మరణ ఉత్తమం.

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

ABOUT THE AUTHOR

...view details