Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18-05-2022 ) - Today Horoscope
Horoscope Today (18-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
Horoscope Today
By
Published : May 18, 2022, 4:14 AM IST
Horoscope Today(18-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది.
వృత్తి,వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్ని ఇస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.
మంచి సమయం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్ధ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి దర్శనం శుభప్రదం.
కొన్ని విషయాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. నవమంలో చంద్రస్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యం. మనోవిచారం. చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచిది.
అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులలో విజయం కోసం గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.
వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిరనిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
ప్రయత్నకార్యసిద్ది కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాలతో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని ఇస్తుంది.
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.శివనామాన్ని జపించాలి
ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్రశ్లోకం చదవాలి.