తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-05-2022) - Horoscope news

Horoscope Today (17-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : May 17, 2022, 4:39 AM IST

Horoscope Today(17-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ నమ్మకండి. చంద్ర ధ్యానం ఉత్తమం.

మనఃస్సౌఖ్యం ఉంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

శుభ సమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆగ్రహావేశాలకు పోవద్దు. వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శని ధ్యానం చేయాలి.

గొప్ప ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. వ్యాపారలాభాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. ఆర్ధికంగా శుభకాలం. ఇష్టదైవ ధ్యానం మంచిది.

భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

గ్రహబలం బాగుంది. స్థిరమైన నిర్ణయాల వల్ల మంచి చేకూరుతుంది. మానసికోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పు, సహనంతో ముందుకు సాగండి, సత్పలితాలు సిద్ధిస్తాయి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details