Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16-05-2022)
Horoscope Today (16-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
HOROSCOPE TODAY
By
Published : May 16, 2022, 4:57 AM IST
Horoscope Today(16-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
పట్టుదల వీడకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. తోటివారి సహకారంతో ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఇష్ట దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
మిశ్రమకాలం. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి శ్రమ అధికమవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
గొప్ప శుభకాలం. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. మీ మీ రంగాల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఈశ్వర ఆరాధనా శుభప్రదం.
బుద్ధిబలం బాగుంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మధ్యమ ఫలితాలున్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వలన అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. శనిధ్యాన శ్లోకం చదవండి.
అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబసభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
మధ్యమ ఫలితాలున్నాయి. కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ నామాన్ని జపించడం మంచిది.
చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో అధికారులతో జాగ్రత్త. కుటుంబసభ్యుల సహకారం మేలుచేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.