Horoscope Today (01-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..
Horoscope Today (01-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
రాశి ఫలాలు
By
Published : May 1, 2022, 4:32 AM IST
Horoscope Today(01-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం; శుక్లపక్షం పాడ్యమి: రా.2-06 తదుపరి విదియ భరణి: రా.9-16 తదుపరి కృత్తిక వర్జ్యం: ఉ. 5-58 నుంచి 7-40 వరకు
అమృత ఘడియలు: సా. 4-10 నుంచి 5-51 వరకు
దుర్ముహూర్తం: సా.4.34 నుంచి 5.51 వరకు రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.5.38, సూర్యాస్తమయం: సా.6.15
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.
అనుకూల ఫలితాలు సిద్దిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.
సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
ధర్మసిద్ది ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. దైవబలం ఉంది. ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
శుభకాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. సర్వత్రా శుభఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్దిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. కీలక వ్యవహారాలలో పెద్దలు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శివాష్టోత్తరం చదవాలి.
శ్రేష్ఠమైన కాలం. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.
ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.