తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (28-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - Horoscope Today latest news

Horoscope Today (28-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Mar 28, 2022, 4:12 AM IST

Horoscope Today (28-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం:

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. లక్ష్యాలు నెరవేరుతాయి. అనవసరంగా వాదులాటలకు దిగకపోవడమే మంచిది. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.

వృషభం:

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

మిథునం:

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బంధువులతో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

కర్కాటకం:

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.

సింహం:

ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య:

ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

తుల:

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ఆంజనేయ సోత్ర పారాయణ చేయాలి.

వృశ్చికం:

శుభకాలం. ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. పెద్దలనుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ధనుస్సు:

భవిష్యత్ ప్రణాళికలను అమలుచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరం:

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

కుంభం:

పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి, వాటిని ఒక పరీక్షలా ఎదురుకోవలసి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది.

మీనం:

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

ABOUT THE AUTHOR

...view details