తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (26-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలం

Horoscope Today (26-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Mar 26, 2022, 4:42 AM IST

Horoscope Today (26-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం:

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు ఉన్నాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రాహు శ్లోకాన్ని చదువుకోవడం మంచిది.

వృషభం:

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.

మిథునం:

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కర్కాటకం:

అర్థలాభం ఉంది. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

సింహం:

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.

కన్య:

మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

తుల:

విజయసిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.

వృశ్చికం:

ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శివ నామ స్మరణ మంచిది.

ధనస్సు:

శుభకాలం. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక,సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.

మకరం:

మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. అష్టలక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

కుంభం:

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

మీనం:

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం శుభకరం.

ABOUT THE AUTHOR

...view details