తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2022, 4:10 AM IST

ETV Bharat / bharat

Horoscope Today (25-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today (25-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

Horoscope Today (25-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం:

శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహాన్ని విడనాడాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

వృషభం:

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన శుభకరం.

మిథునం:

ప్రారంభించిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం:

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

సింహం:

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం.

కన్య:

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

తుల:

ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం.

వృశ్చికం:

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనస్సు:

చేపట్టే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మకరం:

ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం.

కుంభం:

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. శ్రీరామ దర్శనం ఉత్తమం.

మీనం:

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూలమైన సమయం. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రీ రామ నామాన్ని జపించాలి.

ABOUT THE AUTHOR

...view details