తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (24-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

Horoscope Today (24-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Mar 24, 2022, 4:33 AM IST

Horoscope Today (24-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం:

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.

వృషభం:

ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం:

ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

కర్కాటకం:

పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

సింహం:

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

కన్య:

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

తుల:

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.

వృశ్చికం:

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి చదవాలి.

ధనస్సు:

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.

మకరం:

మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.

కుంభం:

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం:

ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details