Horoscope Today (23-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;
ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
పంచమి: ఉ.6.11 తదుపరి షష్ఠి తె.3.54 తదుపరి సప్తమి
అనూరాధ: రా.8.51 తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.01 నుంచి 3.29 వరకు
అమృత ఘడియలు: ఉ.10.57 నుంచి 12.28 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.42 నుంచి 12.30 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6.06, సూర్యాస్తమయం: సా.6.07
మేషం
శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆపదలు పెరుగుతాయి. ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది.
వృషభం
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనావిధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం చదవాలి.
మిథునం
మనఃసౌఖ్యం ఉంది. కృషి,పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది.
కర్కాటకం
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. పంచమ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. దుర్గా శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.
సింహం
ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువుల సూచనలు మేలు చేస్తాయి. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.
కన్య
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభిస్తుంది. కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.
తుల
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సును ఇస్తుంది.
వృశ్చికం
శుభఫలితాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. సూర్యాష్టకం చదవడం మంచిది.
ధనుస్సు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.
మకరం
ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.
కుంభం
శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (మార్చి20 - మార్చి 26)