Horoscope Today(12-06-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభించిన పనులు పనులు చకచకా పూర్తవుతాయి. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగండి. చేసే పనిలో నిపుణత అవసరం. మనపక్కనే ఉంటూ, మనల్ని ఇబ్బందిపెట్టేవారున్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
అనుకూల సమయం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్దిస్తాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.