తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (02-06-2022 ) - TODAY HOROSCOPE

Horoscope Today (02-06-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY ASTROLOGICAL PREDICTION FOR JUNE 02
HOROSCOPE TODAY ASTROLOGICAL PREDICTION FOR JUNE 02

By

Published : Jun 2, 2022, 4:19 AM IST

Horoscope Today(02-06-2022): ఈ రోజు గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మంచి కాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.

ప్రారంభించబోయే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

వృత్తి,ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పని పెద్దలను మెప్పిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో వాగ్వాదాలు చేయకండి. చంద్రశ్లోకం చదవాలి.

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయం కన్నా వ్యయం మించకుండా చూసుకోవాలి. ఈశ్వరదర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. కొన్ని పరిస్థితులు మానసిక అసంతృప్తిని కలిగిస్తాయి. సూర్యగ్రహ ధ్యానం మంచిది.

ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో తోటివారి సహకారం అవసరం. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

ప్రారంభించబోయే పనిలో విజయం ఉంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. శివారాధన శుభకరం.

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

ప్రశాంత చిత్తంతో పనులను చేయండి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారున్నారు. శ్రీవేంకటేశ్వరుని ఆరాధించడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details