తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20-01-2022)

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం

By

Published : Jan 20, 2022, 4:17 AM IST

Horoscope Today: ఈ రోజు (20-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం

విదియ: ఉ. 7.07 తదుపరి తదియ

ఆశ్లేష: ఉ. 7.55 తదుపరి మఘ

వర్జ్యం: రా. 8.27 నుంచి 10.07 వరకు

అమృత ఘడియలు: తిరిగి తె. 6.28 నుంచి ఉ. 7.55 వరకు

దుర్ముహూర్తం: ఉ. 10.20 నుంచి 11.05 వరకు తిరిగి మ. 2.46 నుంచి 3.31 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.39, సూర్యాస్తమయం: సా.5.44

మేషం

ధర్మసిద్ధి ఉంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వరధ్యానం శుభప్రదం.

వృషభం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిథునం

కాలానుగుణంగా ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

కర్కాటకం

మిశ్రమ కాలం. అప్రమత్తముగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహం

కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం చదవాలి.

తుల

ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

వృశ్చికం

కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. సూర్యారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు

ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల పట్ల దృష్టి తగ్గించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

మకరం

ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

కుంభం

ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మీనం

అనుకున్న పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు.విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదేవతా శ్లోకాన్ని చదవాలి.

ABOUT THE AUTHOR

...view details