తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-01-2022) - Today Horoscope latest

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం

By

Published : Jan 17, 2022, 5:08 AM IST

Horoscope Today: ఈరోజు (17-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయనం హేమంత రుతువు; పుష్య మాసం

శుక్ల పక్షం పూర్ణిమ: తె. 4.29 తదుపరి బహుళ పాడ్యమి పునర్వసు: తె. 4.20 తదుపరి పుష్యమి

వర్జ్యం: మ.3.10 నుంచి 4.55 వరకు

అమృత ఘడియలు: రా.1.41 నుంచి 3.26 వరకు

దుర్ముహూర్తం: మ. 12.32 నుంచి 1.16 వరకు తిరిగి మ.2.44 నుంచి 3.29 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.38, సూర్యాస్తమయం: సా.5.42

మేషం

మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

వృషభం

శారీరక శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని రానీయకూడదు. సమయం వృథా చేయకండి. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మిథునం

శుభకాలం. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగితే అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం ఉంది. గణపతి ఆరాధన శుభాన్నిస్తుంది.

కర్కాటకం

వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. భయాందోళనలు విడిచిపెట్టాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం

విశేషమైన శుభఫలితాలున్నాయి. నైపుణ్యంతో గొప్ప పేరును సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంది. ఈశ్వర దర్శనం చేయడం మంచిది.

కన్య

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్నీ కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మి సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

తుల

ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.

వృశ్చికం

చేపట్టే పనుల్లో రెండు ఆలోచనలతో వెళ్లకండి. గిట్టని వారికి దూరంగా ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని పూజించాలి.
ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శివ నామాన్ని జపించండి.

మకరం

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.

కుంభం

మిశ్రమకాలం. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దేహ జాడ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

మీనం

శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details