తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16-01-2022) - horoscope today telugu eenadu

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం

By

Published : Jan 16, 2022, 4:36 AM IST

Horoscope Today: ఈరోజు (16-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయనం హేమంత రుతువు; పుష్య మాసం;

శుక్ల పక్షం చతుర్దశి: రా.2.39 తదుపరి పూర్ణిమ, ఆరుద్ర: రా.2.01 తదుపరి పునర్వసు,

వర్జ్యం: ఉ. 8.47 నుంచి 10.33 వరకు,

అమృత ఘడియలు: మ.2.58 నుంచి 4.44 వరకు

దుర్ముహూర్తం: సా. 4.13 నుంచి 4.57 వరకు

రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6.39

సూర్యాస్తమయం: సా.5-42 కనుమ పండుగ

మేషం

బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మేలు చేస్తుంది.

వృషభం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మిథునం

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోవద్దు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

సింహం

వృత్తి,ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత దర్శనం ఉత్తమం.

కన్య

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వరదర్శనం ఉత్తమం.

తుల

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

వృశ్చికం

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాయిబాబా సచ్చరిత్ర చదవడం మంచిది.

ధనుస్సు

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

మకరం

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

కుంభం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీనం

మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details