Horoscope Today (27/02/22): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ASTROLOGICAL HOROSCOPE TODAY
Horoscope Today (27-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
రాశి ఫలం
By
Published : Feb 27, 2022, 6:25 AM IST
|
Updated : Feb 27, 2022, 6:51 AM IST
Horoscope Today (27-02-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గ ఆరాధన వల్ల మేలు జరుగుతుంది.
ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనః పీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
శుభఫలాలు అందుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యం తో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం
కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలన సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.
సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.
ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభ వార్త ఆనందాన్నిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రసంశలు పొందుతారు. ప్రయాణాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. సూర్య ఆరాధనా శుభప్రదం.
మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది
తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.