Horoscope Today (26-02-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. తోటివారితో వాదోపవాదాలు చేయకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
వృషభం
గ్రహబలం మిశ్రమంగా ఉంది. మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్దిస్తాయి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
మిథునం
ప్రారంభించిన పనులలో మంచి ఫలితాలను అందుకుంటారు. మనస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ది కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభకరం.
కర్కాటకం
శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.
సింహం
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సును ఇస్తుంది.
కన్య
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది.