Horoscope Today (20-02-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
అనుకూల కాలం. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
వృషభం
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
మిథునం
ముఖ్య పనులను ప్రారంభించండి. పరిస్థితులకు తగినట్ట్టు ముందుకు సాగాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట విలువను కాపాడుకోవాలి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం
మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గురు ఆరాధన మేలు చేస్తుంది.
సింహం
మంచికాలం. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మీ ప్రతిభతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం
కన్య
సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం